చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఆ తరువాత హీరోగా మారి ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ హీరోగా ఎదిగాడు శివ కార్తికేయన్. తన సినిమాలతో కేవలం తమిళ్ లోనే తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గానే మహావీరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివ కార్తికేయన్. తెలుగులో ఈసినిమా మహావీరుడు అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఈసినిమా జులై 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకొని తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం కట్టించిన ఇంటిలోకి వెళ్లిన ఓ యువకుడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ఆ పరిస్థితులను ఆ యువకుడు ఎలా అడ్డుకున్నాడు అనే కాన్సెప్ట్ తో ఈసినిమాను తెరకెక్కించారు.
కాగా ఈ సినిమాలో శివ కార్తికేయన్ కు జోడిగా అదితి శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమాను శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందించగా.. భరత్ శంకర్ అందించాడు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా.. కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: