హిందీలో కూడా డెవిల్- ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

kalyan ram devil movie hindi first glimpse released

నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కథతో వచ్చాడు. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఈసినిమాను చాలా సైలెంట్ గా మొదలుపెట్టి..అంతే సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రబృందం. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా మొదలుపెట్టింది. ఈమధ్యే కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వార తెలియచేసింది. అంతేకాదు ఈసందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. స్పై మూవీ అంటే పాన్ ఇండియా వైడ్ గా రీచ్ ఉంటుంది.. అందరూ చూసే జోనరే కాబట్టి హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం మరి.. ఇప్పటికే మన తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.. ఈసినిమా ఎంత వరకూ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో..

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.