డిటెక్టివ్ కార్తీక్ రివ్యూ – గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అలరించే థ్రిల్లర్

detective karthik telugu movie review

వెంకట్ నరేంద్ర దర్శకత్వంలో రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శృతి మోల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా డిటెక్టివ్ కార్తీక్. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుందని ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లతో అర్థమైంది. అంతేకాదు టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శృతి మోల్, అనూష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారీ, యెషో భరత్ రెడ్డి
దర్శకత్వం..వెంకట్ నరేంద్ర
బ్యానర్.. రీడింగ్ లాంప్ క్రియేషన్స్
నిర్మాత.. అశోక్ రెడ్డి
సంగీతం.. మార్కస్ ఎం
సినిమాటోగ్రఫి.. సిద్దం నరేష్

కథ.. రిషిత అనే స్కూల్ స్టూడెంట్ ను మర్డర్ జరుగుతుంది. ఇక ఈమర్డర్ కేసును ప్రైవేట్ డిటెక్టివ్ లు అయిన సంధ్య (శృతి మోల్), పల్లవి (గోల్డీ నిస్సీ) ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. మరోవైపు సంధ్య ప్రేమిస్తూ ఫాలో అవుతుంటాడు కార్తీక్ ( రజత్ రాఘవ్). ఇదిలా ఉండగా మర్డర్ కేసు సాల్వ్ చేస్తుండగా సంధ్య మిస్ అవుతుంది. ఇక సంధ్య ఎలా మిస్ అయిందో తెలుసుకునే పనిలో పడతాడు కార్తీక్. ఇక సంధ్యను వెతికే క్రమంలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి కార్తీక్ కు. మరి స్టూడెంట్ ను ఎవరు చంపారు..? సంధ్య ఎలా మిస్ అవుతుంది..? మర్డర్ కు సంధ్య మిస్ అవ్వడానికి సంబంధం ఏంటి? కార్తీక్ కు తెలిసిన కొత్త విషయాలు ఏంటి? ఫైనల్ గా సంధ్య ను కనిపెట్టాడా?లేదా? అన్నది మిగిలిన కథ..?

విశ్లేషణ
ఈమధ్య చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా ఏం లేదు. ఆ సరిహద్దులు ఎప్పుడో చెరిపేశారు ప్రేక్షకులు. అందుకే ఈమధ్య కథను నమ్ముకొని వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ లు అందుకుంటున్నాయి. అలా కథను నమ్ముకొని వచ్చిన సినిమానే డిటెక్టివ్ కార్తీక్.

నిజానికి సినీ ప్రేక్షకులలో ఒక్కోక్కరికి ఒక్కో జోనర్ నచ్చుతుంది. అందరికీ అన్ని జోనర్ లు నచ్చవు. కానీ అందరికీ నచ్చే జోనర్ థ్రిల్లర్ జోనర్. థ్రిల్లర్ సినిమాలంటే అందరూ ఇష్టపడతారు. సినిమాలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండి సినిమా చూసే ప్రేక్షకుడిని మొదటి నుండి చివరివరకూ ఎంగేజ్ చేయగలిగితే చాలు సినిమా సూపర్ సక్సెస్. ఇప్పుడు రిలీజ్ అయిన డిటెక్టివ్ కార్తీక్ సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. మర్డర్ కేసుతో మొదలైన ఈసినిమాను ఎండింగ్ వరకూ.. ఒక ట్విస్ట్ నుండి బయటకు వచ్చే లోపే మరో ట్విస్ట్ ను పెట్టి.. టైట్ స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ వెంకట్ నరేంద్ర సక్సెస్ అయ్యాడు. అనవసరమై సన్నివేశాలను కానీ.. పనికిరాని కామెడీ సీన్లు లాంటివి కానీ యాడ్ చేయకుండా క్లీన్ గా చూపించాడు.

పెర్ఫామెన్స్
ఈసినిమాలో ఒకరిద్దరు తప్పా మిగిలిన వారు అందరూ కొత్త నటీనటులే. అయినా కూడా అలా ఎక్కడా అనిపించదు. కార్తీక్ పాత్రలో నటించిన రజత్ రాఘవ్ కు నటుడిగా అనుభవం ఉంది కాబట్టి చాలా ఈజ్ తోనే నటించుకుంటూ వెళ్లాడు. చాలా కూల్ గా సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఫీమేల్ లీడ్ లో నటించిన గోల్డీ నిస్సీ కూడా యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలింస్ లలో నటించింది. దీంతో ఆమె కూడా బాగానే నటించింది. శృతిమోల్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఇదిలా ఉండగా కార్తీక్ ఫ్రెండ్ పాత్రలో నటించిన హరి పాత్ర కూడా బాగుంది. నెగెటివ్ షేడ్ లో నటించిన భరత్ బండారీ కూడా తన నటనతో మెప్పించాడు. ఇక మిగిలిన నటీనటులు తమపాత్రల మేర నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు సంగీతం చాలా ఇంపార్టెంట్. అందులోనూ పాటలు ఆస్తమానం వచ్చినా చూసే ప్రేక్షకుడికి చాలా విసుగ్గా ఉంటుంది. ఇక ఈసినిమాలో పాటలు లేకపోవడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కేవలం ఒక్క పాట మాత్రమే ఉంది. అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సన్నివేశానికి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకా సినిమాటోగ్రఫి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెద్ద పెద్ద లొకేషన్సే అవసరం లేదని ఈసినిమా మరోసారి నిరూపించింది. ఇక్కడే న్యాచురల్ లొకేషన్స్… విజువల్స్ ను బాగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ సిద్దం నరేష్. చిత్ర నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే డిటెక్టివ్ కార్తీక్ మంచి థ్రిల్లర్ మూవీ అని చొప్పొచ్చు. ప్రతి ఒక్కరూ చూసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here