సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Samajavaragamana Movie OTT Release Date Fixed

మొత్తానికి చాలా రోజుల తరువాత మంచి సక్సెస్ ను అందుకున్నాడు టాలీవుడు యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. నిజానికి శ్రీవిష్ణు సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుందన్న నమ్మకం తెచ్చుకున్నాడు. అయితే విభిన్నమైన సినిమాలు చేస్తున్నా కూడా సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. ఈనేపథ్యంలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సామజవరగమన సినిమాను రిలీజ్ చేసి సూపర్ హిట్ ను అందుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం లో ఈసినిమా తెరకెక్కింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో శ్రీవిష్ణు తన నటనతో మరోసారి మెప్పించాడు. శ్రీవిష్ణుతో పాటు నరేష్ నటన కూడా ఈసినిమాకు మరో హైలెట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా పెద్ద ఎత్తున చేసింది లేదు. చాలా సైలెంట్ రిలీజ్ అయి బాక్సాఫీస్ బద్దలుకొట్టుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా ప్రేక్షకులందరికీ దగ్గరైంది. దీంతో ఈఏడాది వచ్చిన సినిమాల్లో బెస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా స్థానం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ లోకి కూడా వచ్చేస్తుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వారు సొంతం చేసుకోగా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జులై 28వ తేదీన ఈసినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. మరి ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్‌, నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 5 =