విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పుడు డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు కేవలం సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాకుండాా ఓటీటీలో కూడా చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక ప్రస్తుతం వెంకీ నుండి తెలుగులో వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలకు సంబంధించి పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్నటాలెంటెడ్ నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్, అలానే విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంకా ఆండ్రియా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. శ్రద్ధ శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో అలానే రుహానీ సింగ్ డా.రేణు పాత్రలో, నవాజుద్దీన్ వికాస్ మాలిక్, ఆండ్రియా జాస్మిన్ పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హార్ట్ ఆఫ్ సైంధవ్ ఏంటో చెబుతామని మేకర్స్ నిన్న ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అదేంటో తెలియచేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. హార్ట్ ఆఫ్ సైంధవ్ ఎవరో తెలిసిపోయింది. ఈసినిమాలో సారా అనే పాప నటిస్తుంది. గాయత్రి పాప గాఈసినిమాలో సారా కనిపిస్తుంది. వెంకీ ని హత్తుకొని ఉన్న ఈ పోస్టర్ ను చూస్తుంటే సినిమా మొత్తం ఈపాప చుట్టూనే తిరగనుందని అర్థమవుతుంది.
His HEART ❤️
Introducing Baby Sara as
GAYATHRI PAPA from #SAINDHAV ❤️🔥#SaindhavOnDec22Victory @VenkyMama @Nawazuddin_S@KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @vboyanapalli @maniDop @Garrybh88 @tkishore555 @NeerajaKona #Venky75 pic.twitter.com/yMXoLgPoVp
— Niharika Entertainment (@NiharikaEnt) July 17, 2023
కాగా ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: