హరి హర వీరమల్లు తో కల నిజమైంది

nidhi agerwal interesting post on hari hara veera mallu movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ లో పవన్ నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెండేళ్ల క్రితమే వెళ్లింది. కానీ ఇంతవరకూ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఈసినిమా కంటే వెనుక మొదలుపెట్టిన సినిమాలు కూడా ఇప్పటికే రిలీజ్ అవుతున్నాయి. షూటింగ్ మాత్రం చాలా వరకూ పూర్తి చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఈసినిమా గురించి తన ట్విట్టర్ ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది నిధి అగర్వాల్. నా కల నిజమైంది.. పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు లాంటి సినిమాలో నేను కూడా ఎపిక్ జర్నీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది.. అద్భుతమైన టీమ్ తో కలిసి పనిచేయడం నిజంగా బ్లెస్సింగ్ లాంటిది.. నమ్మండి త్వరలో మ్యాజిక్ చూస్తారు అంటూ ట్వీట్ లో పేర్కొంది. అంతేకాదు ఒక పిక్ ను కూడా షేర్ చేసి ఇదే నా ఫస్ట్ షాట్ అంటూ తెలియచేసింది.

కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 16 =