సముద్రంలో దేవర రక్తపాతం

ntr devara movie action schedule completed

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ అరవింద సమేత సినిమా తరువాత చాలా కాలానికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. అయితే అది మల్టీస్టారర్ సినిమా. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి లేట్ అయింది కానీ షూటింగ్ ను మాత్రం నిర్విరామంగా చేస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లు తీసుకోకుండా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇక షూటింగ్ ను సంబంధించిన అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈసినిమాకు డీవోపీ గా పనిచేస్తున్న రత్నవేలు కూడా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్లు ఇస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు. ప్రత్యేకంగా వేసిన సముద్రం సెట్ లో ఎన్టీఆర్ కు సంబంధించిన బ్రూటల్ అండ్ బ్లడ్ సీన్స్ ను చిత్రీకరించడం జరిగింది అని తెలిపారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో మధ్య కీలక సన్నివేశాలు షూట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇంకా మరో రెండు మూడు రోజుల్లో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్టు కూడా అప్ డేట్ ఇచ్చారు. దీంతో దేవర మూవీ ఫుల్ స్వింగ్ లో షూట్ జరుపుకుంటుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీలో ఉన్నారు.

కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ ను హాలీవుడ్ సినిమాలకి వర్క్ చేసిన బ్రాడ్ మిన్నిచ్ అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.