ప్రస్తుతం సీని ప్రేక్షకులు అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్న సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. మెగా హీరోల కాంబినేషన్ అందులోనూ మామ అల్లుళ్ల కాంబినేేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక క్రేజ్ ను ఆ అంచనాలను ఎక్కడా తగ్గించకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండీ ఇప్పటివరకూ రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ వరకూ అలా పెంచుతూనే వస్తున్నారు. జులై 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగిస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ముందుగా మై డియర్ మార్కండేయ అనే బీట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాటలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ ఉండగా తమ స్వాగ్ తో ఆకట్టున్నారు. ఇక తాజాగా జానవులే నెర జానవులే అనే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ మధ్య వచ్చే ఈ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. రెండూ డిఫరెంట్ జోనర్ లో వచ్చిన పాటలు కావడంతో మంచి వ్యూస్ ను సొంత చేసుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి ఈ రెండు పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏదో మీ ఓటు ద్వారా తెలపండి..
[totalpoll id=”100872″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: