లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుందన్న సంగతి ఇప్పటికే తెలిసిందే. అంతేకాదు అటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఏదో ఒక సందేశం ఇస్తుంటాడు శంకర్. దీంతోనే ఈసారి రామ్ చరణ్ తో ఎలాంటి సందేశం ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈమధ్య ఒక నెలరోజులపాటు ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అయితే రీసెంట్ గానే మళ్లీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు శంకర్ తెలిపాడు. భారీ ఫైట్ సీక్వెన్స్ తో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూట్ కు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ తో పాటు ఈసినిమాలో విలన్ గా నటిస్తున్న ఎస్ జే సూర్య కూడా షూట్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి పై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాడట శంకర్.
కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోనుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: