ఇస్రో (భారతీయ అంతర్జాతీయ రీసెర్చ్) సంస్థ నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన విషయం తెలిసిందే కదా. అయితే నేడు చంద్రయాన్ 3 ప్రయోగంతో వచ్చేశారు.
చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. 24 రోజులపాటు భూ కక్ష్యలోనే ప్రదక్షిణ చేయనుంది. అనంతరం 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. తర్వాత చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ అయి అక్కడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. ఇక ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనిపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించి హర్షం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా దీనిపై తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగంతో మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది.. చంద్రయాన్ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం అంటూ ట్వీట్ చేశాడు.
Onward to greater horizons! Thrilled to witness another momentous launch! Congratulations & all the best to the brilliant team at ISRO for the launch of #Chandrayaan3 today! Proud of you all! 👍👍
— Mahesh Babu (@urstrulyMahesh) July 14, 2023
ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక రాజమౌళి తో కూడా మహేష్ బాబు ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: