మాస్ మాహారాజా రవితేజ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే సినిమాల్లో వెంకీ ఒకటి.యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి మినిమం రేటింగ్స్ ను రాబట్టుకుంటుంది.కామెడీ సినిమాల్లోనే ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది.వెంకీ లో కామెడీ సన్నివేశాలు మీమ్స్ రూపంలో ఎంతలా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఈసినిమాకి ఫ్యాన్ కానివారుండరు.శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈసినిమా 2004 లో విడుదలై కమర్షియల్ గాను సక్సెస్ అందుకుంది.ఇక ఈసినిమాను రీ రిలీజ్ చేయాలని అభిమానులు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎట్టకేలకు ఈసినిమా రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఈఏడాది డిసెంబర్ 30న వెంకీ మళ్ళీ థియేటర్లలోకి రానుంది.మరి కలెక్షన్స్ విషయంలో వెంకీ ఎలాంటి సంచనాలను సృష్టిస్తుందో చూడాలి. ఈసినిమాలో స్నేహ హీరోయిన్ గా నటించగా శ్రీనివాస్ రెడ్డి ,చిత్రం శ్రీను,రామచంద్ర,రవితేజ ఫెండ్స్ గా నటించారు.ఇక బ్రహ్మానందం పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది.రవితేజ,బ్రహ్మానందం వచ్చే సన్నివేశాలు హిలేరియస్ అనిపించాయి.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పూర్ణ చంద్రరావు నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: