తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. రీసెంట్ గానే విజయ్ కూడా తన షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ దాస్ లియో సినిమా గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈసినిమా స్టోరీ డిస్కషన్ లో నేను కూడా ఉన్నాను.. నాకు కథ ముందే తెలుసు.. ఈసినిమాలో నటించే వారు వారి రోల్స్ కూడా తెలుసు.. ఈసినిమాపై ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ ఇంక్రెడిబుల్.. అక్టోబర్ 19న థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని తెలిపాడు. ఇంకా ఈసినిమాలో మీరు కూడా ఉన్నారా అన్న ప్రశ్నకు మాత్రం రిలీజ్ రోజే తెలుస్తుంది అంటూ సస్పెన్స్ లో పెట్టారు.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈసినిమా తమిళ్ తోపాటు ఇతర భాషల్లో అక్టోబర్ 19న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: