సౌత్ కొరియా అంబాసిడర్ తో మెగాస్టార్ విందు

megastar chiranjeevi host high tea session with south korean ambassador

మెగాస్టార్ చిరంజీవి తాజాగా దక్షిణ కొరియా అంబాసిడర్ తో భేటీ అయ్యారు. తన ఇంటిలో ఆయనకు విందు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో ఆయనతో దిగిన ఫొటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలోని దక్షిణ కొరియా అంబాసిడర్ చాంగ్‌ జీబాక్‌ కు హై టీ సెషన్‌ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. శ్రీనగర్‌లో ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్‌లో రామ్‌చరణ్‌తో కలిసి `నాటు నాటు` పాటకి డాన్సులు వేసినప్పట్నుంచి మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. దక్షిణ కొరియా, ఇండియా సంస్కృతులు ఒకేలా ఉంటాయని, సినిమా, వినోద రంగానికి సంబంధించిన కల్చర్‌ కూడా దగ్గరగా ఉంటుందని..కె-పాప్‌, కె-డ్రామాలు ఇప్పటికే ఇండియన్‌ ఆడియెన్స్ లో బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కడి కల్చర్‌ని మనవాళ్లు ప్రోత్సహిస్తున్నారని, ఇప్పుడు మన సినిమాలు కూడా అక్కడ ఆడుతున్నాయని ట్వీట్ లో పేర్కొన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.