ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్ నిన్న భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈసినిమా కు ముందు నుండీ ప్రేక్షకుల ఆదరణ ఉండటంతో ఇప్పుడు మంచి టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈసినిమాను చూడటానికి ప్రతిఒక్కరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక దానికి తోడు నేటి టెక్నాలజీని వాడుకుంటూ ఓంరౌత్ ఈసినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. ఆ ప్రభావం టికెట్ బుకింగ్స్ లో చూడొచ్చు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆదిపురుష్ కోసం అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న రిలీజ్ అయిన ఈసినిమా ప్రస్తుతం మంచి ఆదరణను దక్కించుకుంటుంది. రాముని పాత్రలో ప్రభాస్ నటన, ఓం రౌత్ మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అందుకే అలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈసినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకొని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 140 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఒక్క నైజాంలోనే 18 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని నైజాంలో నాన్ RRR రికార్డ్ కొట్టింది. ఇక వీకెండ్ కాబట్టి ఈరెండు రోజుల్లో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. యూఎస్ లో ఇప్పటికే కొత్త రికార్డులు మొదలు పెట్టేసింది. మరి చూద్దాం ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్ఢులు క్రియేట్ చేస్తుందో.
Humbled with your love 🙏🏻
A triumph for #Adipurush at the Global Box Office!Book your tickets on: https://t.co/n21552WT86#Adipurush now in cinemas ✨#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi @UV_Creations #KrishanKumar @vfxwaala… pic.twitter.com/xLGU4kWJLj
— UV Creations (@UV_Creations) June 17, 2023
కాగా ఈసినిమాలో కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇంకా ఈసినిమాకు సినిమాటోగ్రఫి కార్తిక్ పళని, సంగీతం.. అజయ్ అతుల్, ఎడిటింగ్.. అపూర్వ మోతివాలే అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: