శ్రీసింహా భాగ్ సాలే రిలీజ్ డేట్ ఫిక్స్

simha koduri bhaag saale movie release date fixed

మత్తు వదలరా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు శ్రీసింహా. ఇక ఆ తరువాత తెల్లవారితే బుధవారం, దొంగలున్నారు జాగ్రత్త సినిమా సినిమాలు చేశాడు. అయితే ఆరెండు సినిమాలు కూడా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక ఇప్పుడు పలు బిజీగా ఉన్నాడు శ్రీసింహా. అందులో ఉస్తాద్ ఒకటి, భాగ్ సాలే మరొకటి. ఉస్తాద్ సినిమా ఇప్పటికే రిలీజ్ కు సిద్దమవుతుంది. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను వారాహి చలన చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు భాగ్ సాలే అనే సినిమాను కూడా చేస్తున్నాడు శ్రీసింహా. ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఇప్పటివరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఎప్పటినుండో అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్ ఇప్పుడు తాజాగా ఒక అప్ డేట్ తో వచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను జులై 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు.

కాగా క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమానుప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో యష్ రంగినేని, శింగనమల కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.