కాలం ఎంత మారుతున్నాా కొన్ని కథలలో నిజం మాత్రం మారదు. ముఖ్యంగా ఇతిహాసాలు మహాభారతం, రామాయణం లాంటి కావ్యాలు మాత్రం ఎప్పటికీ అలానే నిలిచిపోయేవి. తరాలు మారినా కూడా మార్చడానికి వీలులేని స్పూర్తి కలిగించే కావ్యాలు అవి. పూర్వికులు విన్నారు.. మనం వింటున్నాం.. భవిష్యత్తు తరాలవారు కూడా వింటారు. ఇక రామాయణం మీద ఇప్పటికే వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కథ ఒకటే అయినా దానికి ఆవిష్కరించే వారి పద్దతి ఒక్కోరకంగా ఉంటుంది. త్వరలో ఇదే కథతో ప్రభాస్ ఆదిపురుష్ తో రాబోతున్నాడు. ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం. ఇంకా రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ వెండితెరపై రాముని పాత్రలో మెప్పించిన హీరోలను గుర్తుచేసుకుందాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్టీఆర్- సినీ చరిత్రలో రాముడైనా, కృష్ణుడు, కర్ణుడు, రావణాసురుడు ఇలా ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా ఆ పాత్ర ఎన్టీఆర్ లానే ఉండేదేమో అన్నంతలా ఉంటుంది ఆయన పాత్ర వేస్తే. అప్పట్లో దేవుడి ఫొటోగా ఎన్టీఆర్ ఫొటోను పెట్టుకునే వారంటేనే చెప్పొచ్చు ఆయనను ఎలా ఆరాధించే వారో. ఇక రామునిగా కూడా ఎన్టీఆర్ పలు సినిమాల్లో నటించాడు. లవకుశ, శ్రీ రామాంజనేయ యుద్దం, సీతా రామ కళ్యాణం అనే సినిమాలో రామునిగా పాత్రలో నటించారు.
ఏఎన్నార్.. ఎన్టీఆర్ తీసినన్ని పౌరాణిక చిత్రాలు ఏఎన్నార్ తీయలేదని చెప్పొచ్చు. అయితే సాంఘిక చిత్రాల్లో తన మార్క్ ను చూపించారు. పౌరాణిక సినిమాలు చేసింది తక్కువే. ఇక ఏఎన్నాఆర్ రామునిగా చేసిన సినిమా సీతారమ జననం. ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన రెండో సినిమా ‘శ్రీ సీతారామ జననం’. ఈ సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారారు. ఇక ఇదే ఏఎన్నాఆర్ రాముడిగా నటించిన మొదటి సినిమా అలానే ఆఖరి సినిమా అవ్వడం విశేషం.
శోభన్ బాబు- తన సినీ కెరీర్ లో శోభన్ బాబు కూడా ఎన్నో పాత్రల్లో నటించినా పౌరాణిక సినిమాల్లో కూడా తన ప్రతిభను కనబరిచారు. ఇక శోభన్ బాబు రాముడిగా కనిపించిన సినిమా సంపూర్ణ రామాయణం. ఎన్టీఆర్ తరువాత రాముడి పాత్రలో అంత పేరు తెచ్చుకున్నది శోభన్ బాబు అని చెప్పొచ్చు.
జూనియర్ ఎన్టీఆర్- గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బలరామాయణం సినిమాలో ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించాడు. ఈ సినిమా నేషనల్ అవార్డుని కూడా అందుకుంది.
శ్రీకాంత్– ఎన్టీఆర్, ఎన్నాఆర్ ల తరం తరువాత పౌరాణిక సినిమాలు తీయడం కూడా తక్కువైపోయింది. వారి తరువాత వచ్చిన నటులు కూడా ఈ సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే అప్పుడొక సినిమా అప్పుడొక సినిమా వచ్చి సందడి చేస్తుంటాయి. అలా మధ్య తరంలో బాాగా అలరించిన సినిమా దేవుళ్లు. ఈసినిమాలో శ్రీకాంత్ రాముడిగా నటించాడు.
సుమన్– ఎన్టీఆర్, శోభన్ తరువాత రాముడి పాత్రలో ప్రేక్షకులనకు బాగా నచ్చిన నటుడు సుమన్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా రామదాసు. ఈసినిమాలో సుమన్ రాముడిగా నటించారు. ఇక తన నటనతో ఆకట్టుకున్నాడు సుమన్.
బాలకృష్ణ- బాపు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా శ్రీ రామరాజ్యం. సినిమాలో నందమూరి బాలకృష్ణ రాముడి పాత్రలో కనిపించి సీనియర్ ఎన్టీఆర్ ని తలపించాడు. లవకుశ సినిమా కథతో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతగా నటించగా, శ్రీకాంత్ లక్ష్మణుడు పాత్రలో కనిపించాడు.
ప్రభాస్- ఇక ఇప్పుడు మరోసారి ఆదిపురుష్ తో రామాయణం సినిమాను విజువల్ వండర్ గా చూపించడానికి వచ్చేస్తున్నాడు ప్రభాస్. ఈసినిమా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్,ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: