బిచ్చగాడు సినిమాతో సూపర్ హిట్ ను కొట్టి తెలుగులో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక ఇప్పుడు బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిచ్చగాడు సినిమా తల్లి సెంటిమెంట్ తో రాగా.. బిచ్చగాడు 2 సినిమా చెల్లి సెంటిమెంట్ వచ్చింది. ఇక ఈసినిమా . సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో కంటే కూడా తెలుగులో ఈసినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్దమవుతుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ నిర్మాణసంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జూన్ 18వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
కాగా ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓం నారాయణన్ అందించగా.. సంగీతాన్ని కూడా విజయ్ ఆంటోని అందించాడు. ‘విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై విజయ్ ఆంటోని ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: