మంగళవారం షూటింగ్ కంప్లీట్ చేసిన అజయ్ భూపతి

ajay bhupathi wraps up mangalavaram movie shoot

ఒక్క సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్ భూపతి. ఆర్ ఎక్స్ 100 తో దర్శకుడిగా పరిచయం అయి మొదటి సినిమాతోనే తన సత్తా చూపించాడు. ఇక ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత మహాసముద్రంతో వచ్చాడు. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కట్టింది. ఇక ఇప్పుడు మరో కథతో వస్తున్నాడు. ఈసినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. రీసెంట్ గానే ఈసినిమా నుండి పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. పోస్టర్లకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వెంటనే మొదలుపెట్టి సినిమాలను వీలైనంత త్వరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నాడు అజయ్ భూపతి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి అజయ్ తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ తో మరోసారి హిట్ కొడతాడేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =