సిటాడెల్- సెర్బియాలో సమంత వరుణ్ ఫన్ టైమ్

Samantha Ruth Prabhu and Varun Dhawan Enjoying free time in serbia

రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత తోపాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసిరీస్ షూటింగ్ దశలో ఉంది. ఇండియాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్ రీసెంట్ గా మరో షెడ్యల్ కోసం సెర్బియా వెళ్లింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే సెర్బియాలోని బెల్గ్రెడ్ లో చిత్రీకరణ ముగిసిన వెంటనే వరుణ్ ధావన్, సమంత అక్కడ సందడి చేశారు. రెండు రోజుల క్రితమే ఓ క్లబ్ లో సమంత తన సూపర్ హిట్ సాంగ్ అయిన ఊ అంటావా మావ ఊహూ అంటావా మావ అనే పాటకు డ్యాన్స్ చేయగా అది వైరల్ అయింది. ఇప్పుడు తమ ఫ్రీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ ఇంకా సమంత. తాజాగా వరుణ్ ధావన్ తన ఇన్ట్సా గ్రామ్ లో షూట్ లో ప్రీ టైమ్ లో అంటూ సమంత తను ఒక డెసర్ట్ ను తింటూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను షేర్ చేశాడు. ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ వెబ్ సిరీస్ ను ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా నటించారు. ‘సిటాడెల్’ ఇంగ్లీష్ వెర్షన్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తయ్యాయి కూడా.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.