ఉస్తాద్ భగత్ సింగ్ – కీ షెడ్యూల్ కోసం భారీ సెట్

massive set erected for ustaad bhagat singh moviemassive set erected for ustaad bhagat singh movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక షూటింగ్ దశలో ఉండగానే మరోపక్క ఎడిటింగ్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఇక ఇప్పుడు మరో కీ షెడ్యూల్ కు రెడీ అవుతుంది చిత్రయూనిట్. ఈనేపథ్యలోనే దీని కోసం భారీ సెట్ ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆద్వర్యంలో ఈ సెట్ ను అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే సెట్ నిర్మాణానికి సంబంధించి చిన్న వీడియోను సైతం పోస్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ స్వాగ్, డైలాగ్, లుక్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది.  కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =