రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆ అంచనాలు ఇంకా పెంచాయి. మరి ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలా ఉంది.. రెండో సినిమా గణేష్ కు హిట్ ను అందించిందా? లేదాా? సినిమా ఎలా ఉంది అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. బెెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాం ప్రసాద్, చరణ్ దీప్, ప్రమోదిని, రవి శివతేజ తదితరులు..
దర్శకత్వం..రాఖీ ఉప్పలపాటి
బ్యానర్స్.. ఎస్‌వీ2 ఎంటర్టైనమెంట్స్
నిర్మాతలు..సతీష్ వర్మ
సినిమాటోగ్రఫి.. అనిత్ మాదడి
సంగీతం..మహతి స్వర సాగర్
కథ
సుబ్బు(బెల్లంకొండ గణేష్) ఓ కాలేజ్ స్టూడెంట్. ఇక స్టూడెంట్ అయిన సుబ్బుకి ఐఫోన్ అంటే బాగా ఇష్టం. ఎప్పటినుండో ఐఫోన్ కొనుక్కోవాలని చూస్తున్నా తన ఆర్థిక పరిస్థితి వల్ల కొనుక్కోలేకపోతున్నాడు. ఫైనల్ గా కష్టపడి ఐఫోన్ ను కొంటాడు. ఇక తను ఎప్పుడైతే ఐఫోన్ కొంటాడో అప్పటినుండి సమస్యల్లో పడతాడు. ఆఫోన్ ద్వారా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మరోవైపు తన అకౌంట్ లోకి 1.75 కోట్ల డబ్బు క్రెడిట్ అవుతుంది. మరి మర్డర్ కేసులో సుబ్బు ఎలా ఇరుక్కున్నాడు.. తన అకౌంట్ లోకి అంత డబ్బు ఎలా వచ్చింది.. మర్డర్ కేసు నుండి తప్పుకోవడానికి సుబ్బు ఏం చేశాడు..? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అన్నదే మిగిలిన కథ..
విశ్లేషణ..
స్వాతిముత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ గణేష్. నిజానికి ఒకప్పటి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు అయినా కూడా ఎలాంటి హడావుడి లేకుండా.. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండానే స్వాతిముత్యం లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. తన సెటిల్డ్ నటనతో ఆకట్టుకొని డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు నేేను స్టూడెంట్ సర్ అనే థ్రిల్లర్ తో వచ్చాడు. మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈసినిమా నేడు రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంటుంది. కొన్ని కొన్ని సినిమాలకు పాయింట్ చాలా చిన్నగా ఉంటుంది. కానీ దానికి ప్రేక్షకుడికి ఎంత కన్విన్సింగ్ గా చూపిస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈసినిమా పాయింట్ కూడా చిన్నదే అయినా కూడా రాఖీ దానిని ఇంట్రెస్టింగ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఫోన్ మిస్సింగ్ పాయింట్ తో బ్యాంకుల్లో జరిగే అక్రమాలను చూపించే ప్రయత్నం చేశాడు రాఖీ.
ఓ మధ్య తరగతి యువకుడికి ఐఫోన్ కొనడం అనేది ఎన్ని సవాళ్లతో కూడుకున్న విషయమో అలానే మధ్య తరగతి యువకుడి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈసినిమాలో చూపించారు. ఫోన్ కొని మురిసిపోవడం .ఆ విషయం తన తల్లికి చెప్పడం.ఆ ఫోన్ ను సొంత తమ్ముడిగా భావించి బుచ్చిబాబు అని పేరు కూడా పెట్టడం ఇవన్నీ సరదాగా సాగిపోతూ ఉంటాయి . సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సంబరపడిపోఏ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే ఎప్పుడైతే హత్య విషయం బయటకు వస్తుందో అప్పుడు కధ మరో మలుపు తిర్గుతుంది. ఫోన్ లో అనుకోకుండా ఒక హత్యకు సంబంధించిన వీడియో రికార్డ్ అవడం.సిటీ పోలీస్ కమిషనర్ అర్జున్ వాసుదేవన్ తో పోరాటం ఆసక్తి కలిగిస్తాయి .
పెర్ఫామెన్స్
ఈసినిమాలో కూడా గణేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మరోసారి తన ఇన్నోసెంట్ నటనతో మెప్పించాడు. ఇక హీరోయిన్ గా నటించిన అవంతిక దాసాని కూడా బాగానే నటించింది. సముద్ర ఖని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీస్ కమిషనర్ పాత్రలో మరోసారి తనదైన నటనతో తన పాత్రకు న్యాయం చేశాడు. సునీల్ కూడా మరోసారి తన కామెడీతో నవ్వించగలిగాడు. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
టెక్నికల్ వాల్యూస్
ఈసినిమాకు సాంకేతిక విభాగం కూడా బాగానే ప్లస్ పాయింట్ అయింది. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా రిచ్ గానే ఉన్నాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా స్క్రీన్ పై క్వాలిటీ మాత్రం కనిపిస్తుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈసినిమా బాగానే నచ్చుతుంది. మిగిలిన వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: