రివ్యూ : పరేషాన్ 

Pareshan Telugu Movie Review

నటీనటులు :తిరువీర్,పావని కరణం,మురళీధర్ గౌడ్ ,అంజి బాబు
ఎడిటింగ్ :హరిశంకర్
సినిమాటోగ్రఫీ :వాసు పెండమ్
సంగీతం :యశ్వంత్ నాగ్
డైరెక్షన్ : రూపక్ రోనాల్డ్ సన్
నిర్మాత : సిద్దార్థ్ రాళ్ళపల్లి
సమర్పణ :రానా దగ్గుబాటి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అవుతున్నాయి.రీసెంట్ గా వచ్చిన మేమ్ ఫేమస్ కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ తోనే వచ్చి హిట్ కొట్టింది.ఇప్పుడు పరేషాన్ అనే సినిమా కూడా సేమ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది.ట్రైలర్ ఆసక్తిగా ఉండడం రానా దగ్గబాటి ఈసినిమాకు సమర్పకుడు కావడంతో పరేషాన్ కు కూడా హైప్ వచ్చింది.ఇక ఈసినిమా ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ: 
తెలంగాణ లో ఒక ఊరు.ఆ ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే ఓ నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్.ఆగ్యాంగ్ లో ఒకరు ఐజాక్ (తిరువీర్).ఐజాక్ వాళ్ళ నాన్న సింగరేణి కార్మికుడు.తన జాబ్ ను కొడుకుకి ఇప్పించి తనని మంచి దారిలో పెట్టి తను సువార్త సభలు చెప్పుకుంటూ బతికేయాలని అనుకుంటున్నాడు.తన ఉద్యోగం తన కొడుకు ఇప్పించాలంటే డబ్బులు అవసరం అవుతాయి.అవి సర్దుబాటు అయ్యాక ఆడబ్బును ఐజాక్ తన ఫ్రెండ్స్ కి ఇస్తాడు.ఆఫ్రెండ్స్ ఏమో ఆ డబ్బును తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో వుంటారు.ఇదిలాఉంటే మరో పక్క ఐజాక్,శిరీష(పావని కరణం) అనే హిందూ అమ్మాయితో ప్రేమలో పడతాడు.మరి ఆతరువాత ఐజాక్ కు అతని ఫ్రెండ్స్ డబ్బును తిరిగి ఇచ్చారా ? శిరీష,ఐజాక్ ల ప్రేమ కథ ఏమైంది ?ఇంతకీ ఐజాక్ వాళ్ళ నాన్న కోరిక నెరవేరిందా లేదా అనేదే మిగితా కథ.

విశ్లేషణ : 

కథ తో పెద్దగా పనిలేకుండా తీసిన సినిమా ఇది.కేవలం నవ్విస్తే చాలు అనుకొని తీశాడు డైరెక్టర్ రోనాల్డ్ సన్.ఆ విషయం లో సక్సెస్ అయ్యాడు. స్టోరీ పెద్దగా లేకున్నా పాత్రలతో కామెడీ పండించాడు.ఫస్ట్ హాఫ్ లో స్నేహితులకు డబ్బుఇచ్చి ఐజాక్ పరేషాన్ అయ్యే సన్నివేశాలు హిలేరియస్ గా వున్నాయి అంతేకాదు ఐజాక్ నాన్న..సమర్పణ్ సువార్త ఇంగ్లీష్ అనువాదంతో చాలా చోట్ల ఫన్ జనరేట్ అయ్యింది.ఇక ఐజాక్ ,శిరీషా ప్రేమ కథ కూడా  వినోదాన్ని పంచుతుంది.ఇవేగాక ఐజాక్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడైన సత్తి లోకల్ టీవీ యాంకర్ తో నడిపే ప్రేమాయణం కూడా నవ్వు తెప్పిస్తుంది.ఇలా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల ఫన్ జనరేట్ అయ్యింది.కానీ సెకండ్ హాఫ్ లో ఇలాంటి మూమెంట్స్ మిస్ అయ్యాయి. ఈవిషయంలో డైరెక్టర్ కొంచెం కేర్ తీసుకోవాల్సింది.సెకండ్ హాఫ్ డల్ గా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.

కేవలం ఎంటర్టైన్మెంట్ చేయాలనే లక్ష్యంతో పెద్దగా కథ జోలికి పోలేదు దాంతో సెకండ్ హాఫ్ లో కొత్తగా  తెలుసుకోవడానికి ఏం లేకుండా పోయింది.ఈ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగా ఎంటర్టైన్ చేసేదే.ఓవరాల్ గా అయితే పరేషాన్ ను టైం పాస్ కోసం ఓసారి చూసేయొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే లీడ్ రోల్ లో నటించిన తిరువీర్ సినిమాకు మెయిన్ ప్లస్ అయ్యాడు.తన అమాయకత్వంతో కూడిన నటన ఐజాక్ పాత్రకు ప్రాణం పోసింది.చాలా సహజంగా నటించాడు అలాగే ఈమధ్య తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో ఎక్కువ కనుబడుతున్న నటుడు మురళీధర్ గౌడ్.సీరియస్ గా ఉంటేనే మంచి కామెడీ పండించగలడు.ఈసినిమాలో కూడా మరోసారి అలాంటి పాత్రతోనే  అలరించాడు అలాగే హీరోయిన్ పాత్రలో నటించిన శిరీష,సత్తి పాత్రలో నటించిన అతను కూడా  చాలా బాగా చేశారు.

ఇక టెక్నికల్ విషయానికి వస్తే రెండు పాటలు బాగున్నాయి అలాగే నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది.ఎడిటింగ్ ఓకే.సినిమాటోగ్రఫీ బాగుంది,విలేజ్ వాతావరణాన్ని బాగా చూపించారు.లో బడ్జెట్ లో తీసిన సినిమా ఇది.సినిమాకు ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టాడు నిర్మాత.

ఓవరాల్ గా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జాతి రత్నాలు సినిమా స్పూర్తితో వచ్చిన ఈ పరేషాన్ చాలా వరకు  నవ్విస్తుంది.టైం పాస్ కోసం ఈసినిమాను ఓ సారి చూసేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =