ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభినయం, డ్యాన్స్ తో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సాయిపల్లవి బిహేవియర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటారు. లేడీ పవర్ స్టార్ అనే బిరుదు ను దక్కించుకుందంటే మాములు విషయం కాదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సాయిపల్లవి తనకు నచ్చిన పాత్ర, కథ దొరికితేనే కానీ సినిమాను చేయడానికి ఒప్పుకోదన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు అయినా కథకు ప్రాధాన్యత లేకపోతే నిర్మొహమాటంగా ఈమె ఆ సినిమాని రిజెక్ట్ చేస్తుంటారు. అయితే విరాట పర్వం, గార్గి సినిమాల తరువాత మరే తెలుగు సినిమాలో నటిస్తున్న ఛాయలు లేవు. దీంతో చాలా గ్యాప్ రావడంతో సాయి పల్లవికి కథలు నచ్చడంలేదా..మరి ఇంకేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి అభిమానుల్లో.
ఈనేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చింది సాయిపల్లవి. తనకి గ్యాప్ రాలేదని.. కావాలని తానే గ్యాప్ తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కొద్ది రోజులు షూటింగ్ లకు బ్రేక్ ఇద్దామనే ఏ సినిమాను ఒప్పుకోలేదని తెలిపింది. కాగా తెలుగులో ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనప్పటికీ తను తమిళంలో నటించనున్న కొత్త సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈసినిమాలో శివకార్తికేయ హీరోగా నటిస్తుండగా.. రాజ్ కమల్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుంది. చూద్దాం త్వరలో ఏదైనా తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: