యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టి కొంతవరకూ పూర్తి చేశాడు కొరటాల. రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. క్యాచీ టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ఇప్పుడు షూట్ కు చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఫ్యామిలీతో చిన్న ట్రిప్ ను ప్లాన్ చేశాడు. ఈనేపథ్యంలో భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి వెకేషన్ కు వెళ్లి పోయాడు. వెకేషన్ నుండి రాగానే మళ్లీ షూట్ తో బిజీ అవ్వనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ ను హాలీవుడ్ సినిమాలకి వర్క్ చేసిన బ్రాడ్ మిన్నిచ్ అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: