విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2016లో విడుదలైన ఈసినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.తల్లి కోసం బిచ్చగాడి మారిన కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. దాంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా కు సీక్వెల్ గా వచ్చింది బిచ్చగాడు 2.కేవలం టైటిల్ ను మాత్రమే వాడుకున్నారు కానీ నిజానికి ఇది సీక్వెల్ కాదు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిన్న ఈసినిమా థియేటర్లలోకి వచ్చింది.అయితే ఈసినిమాకు మాత్రం మిక్సెడ్ రివ్యూస్ వచ్చింది.కానీ రివ్యూస్ ను పట్టించుకుకుండా ఈసినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 4.5కోట్ల గ్రాస్ ను రాబట్టి అదుర్స్ అనిపించుకుంది.హైలెట్ ఏంటంటే తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఎక్కువ రాబట్టింది. తమిళ వెర్షన్ 3.25కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది.
🔥BLOCKBUSTER🔥 pic.twitter.com/oZcT5gHED6
— vijayantony (@vijayantony) May 20, 2023
తెలుగులో ఈసినిమాను పెద్దగా ప్రమోట్ చేయకుండానే ఈ రేంజ్ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా రాధా రవి,వైజి మహేంద్రన్,మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. డైరెక్షన్ తోపాటు సంగీతం కూడా విజయ్ ఆంటోనీ నే అందించాడు.ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: