ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేవర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు మేకర్స్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక దీని తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమాను చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో పాటు ఎన్టీఆర్ వార్2 సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ ట్వీట్ తో క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ కు హృతిక్ రోషన్ తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసిన సంగతి తెలిసిందే కదా. హ్యాపీ బర్త్ డే తారక్.. ఈరోజు చాలాా ఆనందకరమైన రోజు.. ఇంకా యాక్షన్ ప్యాక్డ్ ఇయర్ కావాలని కోరుకుంటున్నాను. యుద్దభూమిలో నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను.. మనం కలిసేంతవరకూ నువ్వు ప్రతిరోజు ఆనందంగా..శాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ తన ట్వీట్ లో తెలిపాడు. ఇక ఈ ట్వీట్ కు గాను ఎన్టీఆర్ స్పందించి రిప్లై ఇచ్చాడు. మీ లవ్లీ విషెస్ కు థ్యాంక్స్ సార్.. మీరు కూడా డేస్ లెక్కబెట్టడం మొదలుపెట్టండి..మీరు కూడా బాగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు.
Thank you sir for your lovely wish!
I’m going to soak in the day today…You should start counting down the days too… Hope you sleep well thinking about what awaits because I want you well rested at the yuddhabhoomi 💪💣✊ see you soon!
— Jr NTR (@tarak9999) May 20, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.