క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ ప్రాంచైజ్ పొన్నియన్ సెల్వన్. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో.. ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ గా ప్రాజెక్ట్ రెండు పార్ట్ లుగా చిత్రీకరించారు. ఈ సినిమా పార్ట్ 1 వచ్చే ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయింది. ఏప్రిల్ 28వ తేదీన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ ఇంకా ఎంగేజింగ్ ఉండటం.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కథ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఈసినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసుకుంది. నాలుగు రోజుల్లో 200కోట్లు కలెక్ట్ చేసుకొని కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంది. ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతుంది. ఇక ఈవారం రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 265 పైగా కోట్లను కలెక్ట్ చేసుకుంది. ఒక్క తమిళ నాడులో 100కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకోగా ఇండియన్ వైడ్ గా 140 కోట్లను రాబట్టుకుంది.
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫీ.. రవి వర్మన్, ఎడిటర్.. ఎ. శ్రీకర్ ప్రసాద్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: