సాయి ధరమ్ తేజ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా ఇక్కడ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవడంతో ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళ్, హిందీ, మలయాాళం భాషల్లో మే 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఈ సందర్భంగా హిందీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సాయి తేజ్ విరూపాక్ష2 గురించి తెలిపాడు. ఒకసారి విరూపాక్ష ఎండింగ్ చూస్తే తెలుస్తుంది విరూపాక్ష2 కి సంబంధించిన హింట్ ఉంటుంది.. సెకండ్ పార్ట్ ప్లానింగ్ లో ఉన్నాం కానీ ఇప్పుడు కాదు.. ఎందుకంటే విరూపాక్ష కు వచ్చిన రెస్పాన్స్ వల్ల సెకండ్ పార్ట్ పై అంచనాలు ఉంటాయి.. ఫస్ట్ పార్ట్ ను మ్యాచ్ చేయాలంటే బలమైన కథ ఉండాలి.. రైట్ టైమ్ ఇంకా కరెక్ట్ కథ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ తెలిపాడు.
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా.. సునీల్,సాయి చంద్, అజయ్,బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈసినిమా కు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే తేజ్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఈసీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: