మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. రామ్ చరణ్ లాంటి హీరోతో శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. అందుకే కాంబినేషన్ సెట్ అయినప్పటినుండీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రిభినయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా క్లైమాక్స్ ను శంకర్ చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం క్లైమాక్స్ చిత్రీకరణ కోసం హైద్రాబాద్ సివారులో శంషాబాద్ ఏరియాలో ప్రత్యేకమైన సెట్ ను నిర్మించినట్టు తెలుస్తుంది. అక్కడు రామ్ చరణ్ ఇంకా ఎస్ జే సూర్య మధ్య యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
కాగా కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: