ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తా

akhil gives clarity on real stunt for agent movie

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏజెంట్. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈసినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా 172 అడుగుల ఎత్తు నుంచి రోప్ సహాయంతో స్టంట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రమోషన్ లో భాగంగా ఈ స్టంట్ గురించి చెబుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అఖిల్. నేను షాపింగ్ మాల్ పై నుంచి దూకడం గురించి అంతా అడుగుతున్నారు. అంత రిస్క్ అవసరమా అంటున్నారు. దానికి నా సమాధానం ఏంటంటే నేను యంగ్ హీరోను.. అందులోనూ నేను చేసింది యాక్షన్ సినిమా సో నా నుండి అభిమానులు ఇలాంటి ఫీట్లు కోరుకుంటారు. ఇక నేను కూడా నా కెరియర్ కోసం ఎంత కష్టమైనా పడతాను. అంతేకాదు నా ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాననే విషయం అందరికీ తెలియాలి. అందువల్లనే నేను ఆ ఫీట్ చేయడం జరిగింది అని క్లారిటీ ఇచ్చాడు. మిగతా హీరోలు చేసినవే చేయడానికి అఖిల్ ఎందుకు? అని మా ఫాదర్ నాతో అంటూ ఉంటారు. నాకు కూడా అది నిజమే కదా అనిపించింది. అందువల్లనే కొత్త జోనర్స్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలా చేసిన సినిమానే ‘ఏజెంట్’. నా కెరియర్ స్టార్టింగ్ లోనే నాపై అంచనాలు ఎక్కువగా ఉండేవి. వాటిని అందుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + eighteen =