సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష. గత శుక్రవారం విడుదలైన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది.వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టగా వీక్ డేస్ లోకూడా అదే జోరును కొనసాగిస్తోంది.ఇక నిన్నఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి 5రోజుల్లో 55కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.దాంతో విరూపాక్ష,సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా నిన్న 2.30కోట్ల షేర్ తో మొత్తం 5రోజుల్లో 21.20కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.అటు యూఎస్ఏ లో 900k డాలర్ల ను క్రాస్ చేసింది. నేటితో 1మిలియన్ క్లబ్ లోకి చేరనుంది.తేజుకి ఇదే మొదటి వన్ మిలియన్ డాలర్ సినిమా కానుంది.కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈసినిమాకి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా బీవీఎస్ఎన్ ప్రసాద్,సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు.
ఇదిలావుంటే ప్రస్తుతం సాయి ధరమ్,వినోదయ సీతం రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తేజు మొదటి సారి కలిసి నటిస్తుండగా ఇప్పటికే పవన్ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు.బ్యాలెన్స్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.సముధ్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో కేతిక శర్మ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,బ్రహ్మజీ,రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.జూలై 28న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.త్వరలోనే టైటిల్,ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: