అప్పటినుండే డేటింగ్ స్టార్ట్ చేశాం

vignesh shivan reveals his love story with nayanathara

సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఎప్పుడూ ఫోకస్ ఉంటుంది. ఎవరు ఎవరితో డేట్ చేస్తున్నారో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కొంతమంది సెలబ్రిటీలు వాటిని పట్టింకోరు కానీ..కొంతమంది మాత్రం క్లారిటీ ఇస్తూ ఉంటారు. అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఎన్నో ఎళ్లు సస్పెన్స్ లో ఉంచిన జంట మాత్రం నయనతార-విఘ్నేష్. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసేవాళ్లు తప్పా పెళ్లి అయేంతవరకూ ఎప్పుడూ బహిరంగంగా చెప్పింది లేదు. అలా ఎంతోకాలం ప్రేమాయణం సాగించిన తరువాత లేడీ సూపర్ స్టార్ నయనతార , విఘ్నేష్ శివన్ వివాహబంధంతో బయటయ్యారు. గతేడాది జూన్ లో వీరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సరోగసి ద్వారా గతేడాది అక్టోబర్ లో ఇద్దరు మగ పిల్లలకు కూడా జన్మనిచ్చారు. రీసెంట్ గానే వారి పిల్ల పేర్లను కూడా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పెళ్లయి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్న తరువాత తను ఎలా లవ్ లో పడ్డాడు.. ఎప్పటి నుండి డేటింగ్ మొదలుపెట్టారు అనే విషయాలు తెలియచేశాడు విఘ్నేష్.. కెరీర్ పరంగా నేను ఇబ్బందులు ఎదుర్కొటుంన్న టైమ్ లోనే నేనూ రౌడీనే అనే కథను రాశా.. అయితే నాదగ్గర కథ ఉందని తెలుసుకున్న ధనుశ్ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు.. అంతేకాదు నయనతారను కలిసి కథ గురించి చెప్పమన్నారు. కానీ నయన్ మాత్రం ఈ సినిమాకు ఓకే చెప్పదనే అనుకున్నాను.. ధనుష్ మాటను కాదనలేక నయన్ ను కలిశాను.. నయన్ కు కథ నచ్చింది..ఎంతో గౌరవించింది.. ఆ క్షణమే ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పాడు. ఆ సినిమా రెండో షెడ్యూల్ నుంచే మేము డేటింగ్ స్టార్ట్ చేశాం.. తాము ప్రేమలో ఉన్నామనే విషయం తాము చెప్పేంత వరకు ఎవరికీ తెలియదు.. సెట్ లో మాత్రం నయన్ ను మేడమ్ అనే పిలిచేవాడిని.. ఆమె కారవ్యాన్ లోకి కూడా వెళ్లే వాడిని కాదు… వృత్తి పట్ల ఎంతో కమిట్ మెంట్ తో ఉండేవాళ్లమని చెప్పాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 2 =