రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది ఎప్పటినుండి ఆశగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఈసినిమాపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా వస్తుందని ఎప్పుడైతే తెలిసిందే.. అప్పటినుండీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత కొద్దిరోజులుగా ఈసినిమాలో మహేష్ పాత్రపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. మహేశ్ పాత్ర హనుమంతుడు స్ఫూర్తితో రాశారన్న వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఈసినిమా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిచేసిన విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఈసినిమా గురించి మాడ్లాడుతూ.. రాజమౌళికి పౌరాణిక కథలు ఇష్టం. వాటి నుంచి ప్రేరణ పొందుతాడు. అందుకే తన సినిమాల్లో ఇండియన్ కల్చర్, ఆ ఫ్లేవర్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు వస్తున్న రాజమౌళి సినిమాలో కూడా అది ఉంటుంది.. కానీ, మహేష్ పాత్ర హనుమాన్ స్ఫూర్తితో ఉండదు. అలాగే ఏ పౌరాణిక పాత్రతోనూ పోలి ఉండదు అని స్పష్టం చేశారు. దీంతో ఈవార్తల్లో నిజం లేదన్నది తేలిపోయింది.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























