న్యాచురల్ స్టార్ నాని మంచి బ్లాక్ బస్టర్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా మూవీ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఇప్పుడు అదే జోష్ తో తన నెక్స్ట్ సినిమాను చేయడానికి రెడీ అయిపోతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తన 30 వ సినిమా వస్తుంది. ప్రస్తుతానికి నాని30 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో కూడా నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడు. 6ఏళ్ల కూతురికి తండ్రిగా ఈసినిమాలో నటించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు దసరా సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు దసరా హంగామా అయిపోయింది కాబట్టి తన ఫుల్ ఫోకస్ ను ఈసినిమాపై పెట్టనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూట్ మొదలుపెట్టకముందే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమాను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఇక ఈసినిమాలో సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































