బెల్లంకొండ సురేష్ వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటివరకూ పలు సినిమాలు చేసిన సాయి శ్రీనివాస్ చివరిగా రాక్షసుడు సినిమాతో మొదటి హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెలుగులో వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించి స్టన్నింగ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈసినిమాతో ప్రభాస్ కు మాస్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదే సినిమాను రీమేక్ చేస్తున్నాడు. తెలుగు ఓరిజినల్ స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాదే ఇప్పుడు హిందీ రీమేక్ కు కూడా కథను అందిస్తుండగా.. వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు కూడా. అయితే ఇప్పటివరకూ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజవుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆతరువాత ఈ సినిమా గురించి ఎలాంటి వార్త లేదు. ఇన్ని రోజులకు ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు మాతృక టైటిల్ అయిన ఛత్రపతినే ఫిక్స్ చేశారు. సమ్మర్ కానుకగా మే 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు.
కాగా ఈ సినిమాలో నుష్రత్ భరుచా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలోసాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహమ్మద్ మోనాజీర్, ఔరోషికా డే, వేదిక, జాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా.. పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఈసినిమాకు తనిష్క్ బాగ్చి మ్యూజిక్ అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: