టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుత స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీరామనవమి సందర్భంగా ఆదిపురుష్ మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ అభిమానులు కూడా శ్రీరామ నవమి ఏర్పాట్లను భారీగానే చేయబోతున్నట్లు ,ప్రభాస్ ఆదిపురుష్ పోస్టర్ తో కూడిన 50 ఫీట్స్ కటౌట్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద మార్చి 30న అభిమానులు ఏర్పాటుచేయబోతున్నట్లు , ఈ కటౌట్ నుస్పెషల్గా డిజైన్ చేయబోతున్నట్లు సమాచారం. ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























