చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టింది బలగం. ఈనెల 3న విడుదలైన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం 2కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం సుమారు 24కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజు కి సినిమా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి అయితే ఈ రెస్పాన్స్ కేవలం థియేటర్లకు మాత్రమే పరిమితం కాలేదు. బలగం ,ఓటిటిలోనూ అదే జోరు కొనసాగిస్తూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈనెల 24 న ఈచిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. ఇక సినిమాను చూసిన ప్రేక్షకులనుండి యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ,సినిమా సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ క్యాస్ట్ ఎవరూ లేకుండా వచ్చిన ఈ చిత్రం ఈఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఓటిటిలో విడుదలైన సరే ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో డ్రీం రన్ ను కొనసాగించడం విశేషం. కమెడియన్ వేణు ఎల్దండి డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియదర్శి , కావ్య , వేణు ఎల్దండి , సుధాకర్ రెడ్డి , మురళీధర్ గౌడ్ , రచ్చ రవి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, సహజత్వంతో తెరకెక్కిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ఈసినిమాను హర్షిత్ రెడ్డి , హన్షితా రెడ్డి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: