నాని ,కీర్తి సురేష్ జంటగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ దసరా విడుదలకు సిద్దమవుతుంది.అందులో భాగంగా ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా వున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ,దసరా కు పనిచేసిన సిబ్బందికి గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. దాదాపు 130మందికి గాను కీర్తి ,ఒక్కొక్కరికి 10గ్రాముల గోల్డ్ కాయిన్ ను గిఫ్ట్ గా ఇచ్చిందని సమాచారం. వీటి మొత్తం విలువ సుమారు 70నుండి 75 లక్షల వరకు వుంటుందట. షూటింగ్ లో తనకు సహకరించిన సిబ్బందికి ఏదోకటి ఇవ్వాలని భావించిన కీర్తి,గోల్డ్ కాయిన్స్ ను బహుమానంగా ఇచ్చిందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దసరాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా సంతోష్ నారాయణ సంగీతం అందించాడు. చెరుకూరి సుధాకర్ నిర్మించారు. ఈనెల 30న భారీ స్థాయిలో విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాకు భారీ హైప్ ను తీసుకొచ్చాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
ఇక ఈసినిమా తరువాత కీర్తి సురేష్ తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘బోళా శంకర్’ లో నటిస్తుంది. సూపర్ హిట్ తమిళ్ మూవీ ‘వేదాళం’కు రీమేక్ గా వస్తున్న ఈచిత్రంలో కీర్తి , చిరు కి చెల్లలిగా నటిస్తుండగా తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: