దసరా సెన్సార్ టాక్ ..

Dasara censor talk

నాని నటించిన మచ్ అవైటెడ్ మూవీ దసరా విడుదలకు సిద్దమవుతుంది. అందులో భాగంగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సినిమాకి సెన్సార్ వాళ్ళు యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అలాగే కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయాల్సిందిగా సూచించారు. అయితే సినిమా మాత్రం బాగుందని అన్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ఫలితం కోసం ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సంక్రాంతికి విడుదలైన సినిమాల తరువాత ఆస్థాయి భారీ హైప్ తో విడుదలవుతున్న చిత్రం దసరా. ఇప్పటికే విడుదలైన సాంగ్స్,ట్రైలర్ సినిమా ఫై అంచనాలను పెంచేసింది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

ఇదిలావుంటే నాని ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. నాని మేక్ ఓవర్ సినిమాకు హైలైట్ అవ్వనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. దీక్షిత్ శెట్టి ,సాయి కుమార్ ,సముద్ర ఖని తదితరులు కీలకపాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించగా ఈనెల 30న భారీ స్థాయిలో విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : :point_down:
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =