సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా “అన్నీ మంచి శకునములే” అన్న టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మొన్ననే రాజేంద్ర ప్రసాద్ ను పాత్రను పరిచయం చేస్తూ, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నిన్న ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న గౌతమి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘మీనాక్షి’ అనే పాత్రలో ఆమె నటిస్తున్నట్టు పరిచయం చేస్తూ ఆమె పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఆమె పోస్టర్ తో పాటుగా ఈసినిమా టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్ ను మార్చి 4వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈసినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, గౌతమి, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: