సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. నేడు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుంది ఈసినిమా కూడా. లవ్ మ్యారేజ్ కు వచ్చే ఒక డిఫరెంట్ సమస్యతో ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది.
లవ్ మ్యారేజ్ కి కూడా ఇటువంటి ఒక ప్రాబ్లెమ్ ఉంటుందా ?🤔
Here’s the Birthday Glimpse of @sreevishnuoffl from #Samajavaragamana 🥳
– https://t.co/wpBD9CGoF5#HBDSreeVishnu ✨@Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @GopiSundarOffl @HasyaMovies pic.twitter.com/8VbkkzK4wT
— AK Entertainments (@AKentsOfficial) February 28, 2023
కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: