బిచ్చగాడు 2 రిలీజ్ డేట్ ఫిక్స్

Bichagadu 2 Movie Release Date Fixed,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Bichagadu 2 Movie,Bichagadu 2,Bichagadu 2 Telugu Movie,Bichagadu 2 Movie Updates, Bichagadu 2 Movie Latest Newsvijay Antony New Movie, Vijay Antony Latest Movie,Bichagadu 2 Movie Let Out Date Fixed,Vijay Antony Bichagadu 2 Movie Release Date Fixed,Bichagadu 2 Movie Release Date Announce ,Vijay Antony

తన సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. విభిన్నమైన చిత్రాలతో అటు తమిళ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విజయ్ హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా తన కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈసినిమా బ్లాక్‌బస్ట‌ర్ సాధించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి స్నీక్ పీక్ ట్రైలర్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడమే కాకుండా ఈసినిమాకు దర్శకత్వం బాధ్యతలు కూడా తీసుకున్నారు. అంతేకాదు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఇక కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓం నారాయణన్ అందిస్తున్నారు. ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈసినిమాను విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =