రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సందడి చేశాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు తన కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మాసీవ్ కోల్‌కతా సెట్‌లో ఈ సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవి, కీర్తి సురేష్, మరికొందరు నటీనటులు, 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ పాట చిత్రీకరణ భారీ ఎత్తున జరుగుతోంది. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమా సెట్ ను లెజెండరీ ఫిల్మ్ మేకర్ కె రాఘవేంద్రరావు సందర్శించి టీమ్‌తో సరదాగా గడిపారు. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘చూడాలని వుంది’ లోని సూపర్‌హిట్ పాటను చిత్రీకరించినప్పుడు కోల్‌కతా సెట్‌ను సందర్శించిన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న భోళా శంకర్ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని టీంకు బెస్ట్ విశేష్ అందించారు. మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు మొదలైన అనేక బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన రాఘవేంద్రరావు.. వాల్తేరు వీరయ్య విజయంపై మెగాస్టార్‌ను అభినందించడానికి భోళా శంకర్ సెట్‌కి వచ్చారు. సెట్‌లో అద్భుతమైన వైబ్స్ చూసిన రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాట రామ్మ చిలకమ్మ లాగా చార్ట్‌బస్టర్ అవుతుందని, భోళా శంకర్ సినిమా ‘చూడాలని వుంది’ లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు.
కాగా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: