మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ మొదటి నుండి కాస్త డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికే ప్రయత్నిస్తుండేవాడు. ఒకే తరహా జోనర్‌కు పరిమితం కాకుండా ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తున్నాడు. గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు ఎక్కువశాతం అంతా యూకే లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. గత కొంతకాలంగా ఈసినిమా షూటింగ్ అక్కడే జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. యూకే లో ఈసినిమా భారీ షెడ్యూల్ పూర్తయిందని.. అలానే తరువాత షెడ్యూల్ యూరప్ లో ఉందంటూ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
When @PraveenSattaru gets the perfect shot, @IAmVarunTej Is all business 😎🤘
Team #GandeevadhariArjuna has wrapped up a massive schedule in the UK and is all set to kick-start more classified missions soon in Europe 🌍@MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/C0pTqMnU1l
— SVCC (@SVCCofficial) February 11, 2023
కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: