మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హంట్. యాక్షన్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచారు. మరి ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా సుధీర్ కుఎలాంటి విజయాన్ని అందించిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, మైమ్ గోపి, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ తదితరులు
దర్శకత్వం.. మహేష్
బ్యానర్స్.. భవ్య క్రియేషన్స్
నిర్మాతలు.. వి.ఆనంద్ ప్రసాద్
సినిమాటోగ్రఫి.. అరుల్ విన్సెంట్
సంగీతం.. జిబ్రాన్
కథ..
అర్జున్ (సుధీర్ బాబు), ఆర్యన్ దేవ్ (భరత్), మోహన్ భార్గవ్ (శ్రీకాంత్) ముగ్గురు పోలీస్ ఆఫీసర్లుగా పనిచేస్తుంటారు. అయితే తన స్నేహితుడు హత్యకు గురవుతాడు. ఇక ఈకేసును అర్జున్ ఇన్వెస్టిగేట్ చేసి దోషిని కనిపెడతాడు. ఆ విషయం బయటపెట్టేలోపే అర్జున్ కు యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ కేసును అర్జున్ చేతుల్లో పెడతాడు మోహన్ భార్గవ్. గతం గుర్తు లేకపోవడంతో కేసును మళ్ళీ కొత్తగా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గతం గుర్తులేకపోవడంతో ఇన్వెస్టిగేటింగ్ లో చాలా పలు సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో క్రిమినల్ రాయ్ (మైమ్ గోపీ), కల్నల్ విక్రమ్ (కబీర్ సింగ్), టెర్రరిస్ట్ గ్రూప్ హర్కతుల్ మీద అర్జున్ అనుమానాలు వ్యక్తం చేస్తాడు. మరి గతం గర్తులేని అర్జున్ ఫైనల్ గా హంతకుడు ఎవరో ఎలా కనిపెట్టాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరీల్లో సుధీర్ బాబు ఒకరు. సినిమా సినిమాకు విభిన్నత ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్ గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు కు ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ థ్రిల్లర్ తో వచ్చేశాడు.
మరి థ్రిల్లర్ కథలతో మెప్పించడం అంత ఈజీ కాదు. అందులోనూ ఈమధ్యకాలలో ఎన్నో థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. అందుకే కథను ఎంత కొత్తగా చూపించగలిగితే అంత ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈసినిమా థ్రిల్లర్ కథే అయినా కూడా డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కించాడు డైరెక్టర్. ఈసినిమా మలయాళంలో వచ్చిన సినిమాను ఇక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలో మార్పులు చేసి మహేష్ రూపొందించాడు. అడుగడుగా థ్రిల్లింగ్ అంశాలు లేకపోయినప్పటికీ.. ప్రేక్షకుడిని ఆకట్టుకునే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలరిస్తాయి. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.
సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈసినిమాలో కూడా పోలీస్ పాత్ర కావడంతో ఈజ్ గానే చేసుకుంటూ వెళ్లిపోయాడు. ప్రమోషన్ లో భాగంగా ఈ కథను ఏ హీరో చేయడు. నేను కథను నమ్మి చేశానంతే అని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక అది నిజమే అనిపిస్తుంది. ఈసినిమా చూసిన తరువాత. ఈ పాయింట్‌తో సినిమా తీసేందుకు ముందుకు వచ్చిన సుధీర్ బాబు ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు. ఇలాంటి కథను మన వాళ్లు ఓకే చేయడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ సుధీర్ బాబు మాత్రం తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రను ఎంచుకున్నాడు.
ఇక కీలక పాత్రల్లో నటించిన శ్రీకాంత్, భరత్ కూడా బాగానే నటించారు. శ్రీకాంత్‌కు సీరియస్ రోల్ దక్కింది. శ్రీకాంత్ తన అనుభవంతో చేసుకుంటూ వెళ్లిపోయారు. భరత్ చాలా కాలం తరవాత తెలుగు తెరపై కనిపించాడు. తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతవరకూ పాత్ర డీసెంట్ గా ఉంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్ర నటించారు.
టెక్నికల్ వాల్యూస్
ఇలాంటి సినిమాలకు టెక్నికల్ వాల్యూస్ అనేవి కీరోల్ ప్లే చేస్తాయి. అందులో భాగంగానే సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్స్ బాగున్నాయి. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్స్ తక్కువే అయినా న్యాచురల్ గా అనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బ్యానర్ కు తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.