విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సత్యదేవ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్న సత్యదేవ్ రీసెంట్ గా చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీలో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 25 సినిమాలు కంప్లీట్ చేసుకున్న సత్యదేవ్ తన 26 వ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా లాక్ ఫెవర్స్ ది బ్రేవ్ క్యాప్షన్ తో క్రైమ్ డ్రామా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినాటో కథానాయికలు కాగా సత్యరాజ్, సత్య ఆకుల, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి క్రేజీ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మూవీకి టైటిల్ జీబ్రా గా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జీబ్రా మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: