మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఆ మూవీలో వారిద్దరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. జనవరి 26 వ తేదీ హీరో రవితేజ తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గా స్టార్ చిరంజీవి రవితేజ కు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమ్ముడు రవితేజకి జన్మదిన శుభాకాంక్షలనీ.. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాననీ అంటూ మెగాస్టార్ పెట్టిన ట్వీట్ కి మాస్ మహారాజా రవితేజ లవ్లీ రిప్లై ఇచ్చారు. థాంక్స్ ఏ లాట్ అన్నయ్య, మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ లవ్ ఎమోజిలు పోస్ట్ చేసిన రవితేజ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్, రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: