స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, హాలీవుడ్ డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆస్కార్ నామినేషన్స్ అధికారికంగా ప్రకటించడానికి ముందు అమెరికాకు చెందిన పలు మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించి ఆస్కార్ నామినేషన్ జాబితాలను విడుదల చేస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఆస్కార్ అవార్డుల వేడుక జరగనున్న నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ నటుడుఎన్టీఆర్ కు అరుదైన ఘనత సాధించారు. ఆస్కార్ బెస్ట్ హీరోల లిస్టులో ఆయన నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.యుఎస్ఎ టుడే పోర్టల్ ఆస్కార్ రేసులో నిలిచే టాప్ 10 హీరోల లిస్టును విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ కు టాప్ ప్లేస్ ఇచ్చింది. అమెరికాలోనే ప్రముఖ పత్రికగా కొనసాగుతున్న యుఎస్ఎ టుడే ఇండియన్ యాక్టర్ కు టాప్ ర్యాంక్ ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది.ఈ సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ మూవీపై యుఎస్ఎ టుడే పోర్టల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రాన్ని యాక్షన్ ప్యాక్డ్ మ్యూజికల్ అడ్వెంచర్ గా ప్రకటించింది. ఈ సినిమాను ఇద్దరు ఇండియన్ యాక్టర్స్ ఆడియన్స్ ఫ్రెండ్లీ పవర్ హౌస్‌గా మార్చారనీ , ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా ఫైట్లు, డాన్సులు చేశారనీ , అయినప్పటికీ, ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేయాలి కాబట్టి.. క్రూర జంతువులను పోషించడం, మోటార్ సైకిల్ లాంటి అడ్వెంచర్స్ చేయడం వల్ల.ఎన్టీఆర్ ను నామినేట్ చేసినట్లు వెల్లడించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: