సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం రివ్యూ

2023 Latest Telugu Reviews, Anil Kumar, Kalyanam Kamaneeyam, Kalyanam Kamaneeyam (2023 film), Kalyanam Kamaneeyam (2023) – Movie, Kalyanam Kamaneeyam (film), Kalyanam Kamaneeyam (Telugu) (2023) – Movie, Kalyanam Kamaneeyam 2023, Kalyanam Kamaneeyam Critics Review, Kalyanam Kamaneeyam First Review, Kalyanam Kamaneeyam Movie, Kalyanam Kamaneeyam Movie – Telugu, Kalyanam Kamaneeyam Movie (2023), Kalyanam Kamaneeyam Movie Highlights, Kalyanam Kamaneeyam Movie Plus Points, Kalyanam Kamaneeyam Movie Public Response, Kalyanam Kamaneeyam Movie Public Talk, Kalyanam Kamaneeyam Movie Review, Kalyanam Kamaneeyam Movie Review And Rating, Kalyanam Kamaneeyam Movie Updates, Kalyanam Kamaneeyam Review, Kalyanam Kamaneeyam Review – Telugu, Kalyanam Kamaneeyam Story review, Kalyanam Kamaneeyam Telugu Movie, Kalyanam Kamaneeyam Telugu Movie Latest News, Kalyanam Kamaneeyam Telugu Movie Live Updates, Kalyanam Kamaneeyam Telugu Movie Review, Kalyanam Kamaneeyam Telugu Review, Latest telugu movie reviews, Latest Telugu Movies 2023, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, New Movie Reviews, New Telugu Movie Reviews 2023, New Telugu Movies 2023, Priya Bhavani Shankar, Santosh Sobhan, Sravan Bharadwaj, Telugu cinema reviews, Telugu Filmnagar, Telugu Movie Ratings, telugu movie reviews, Telugu Movie Reviews 2023, Telugu Movies 2023, Telugu Reviews, Telugu Reviews 2023, Tollywood Reviews

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో వస్తున్న సినిమా కళ్యాణం కమనీయం. ఇక ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్‌, దేవి ప్రసాద్, పవిత్రా లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి, కేధార్ శంకర్, రూప లక్ష్మి, సద్దాం, కార్తీక్ ప్రసాద్ తదితరులు
దర్శకత్వం.. అనిల్ కుమార్ ఆళ్ల
బ్యానర్స్.. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ
సంగీతం.. శ్రావణ్‌ భరద్వాజ్‌
సినిమాటోగ్రఫి.. కార్తీక్‌ ఘట్టమనేని

కథ…

శివ (సంతోష్ శోభన్) ఉద్యోగం ఏం చేయకుండా లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. అలా సాగిపోతుండగా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే శృతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో పడతాడు. ఇక ఆమె కూడా శివను ప్రేమించడం.. వాళ్ల ప్రేమను పెద్దలు సైతం ఒప్పుకోవడంతో పెళ్లి కూడా జరిగిపోతుంది. అయితే పెళ్లి అయిన తరువాత అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో శృతి శివను ఉద్యోగం చేయాలని కోరుతుంది. ఉద్యోగం కోసం తను చేస్తున్న ప్రయత్నాలను శృతి గుర్తించకపోవడమే వారి బంధంలో సమస్యలకి కారణం అవుతుంది. మరి శివ ఏ విధంగా తన వివాహ బంధాన్ని నిలుపుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ..

‘గోల్కొండ హైస్కూల్’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేశాడు సంతోష్ శోభన్. ఇక ఆతరువాత తను నేను సినిమాతో హీరోగా పరిచయం అయి అప్పటినుండి పలు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా తనకు కెరీర్ లో సాలిడ్ బ్లాక్ బస్టర్ మాత్రం ఇంతవరకూ రాలేదు. దానికోసమే ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈసినమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇదిలా ఉండగా పెళ్లి కాన్సెప్ట్ పై ఎన్నో సినిమాలు వచ్చినా ఓ కొత్త పాయింట్ ను ఈ సినిమా ద్వారా చూపించాడు దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల. తొలిసారి అయినా దర్శకత్వం లో మంచి వైవిధ్యాన్ని చూపించాడు. వివాహం మరియు పెళ్లయిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవడం వంటి నేటికీ కనెక్ట్ అయ్యే కథనాన్ని తీసుకున్నాడు ఫస్ట్ హాఫ్‌లోని కామెడీని మెయింటెయిన్ చేస్తూనే, సెకండ్ హాఫ్ కథ ప్రధానంగా ఎమోషన్స్‌తో నడిపించాడు.

పెర్ఫామెన్స్..

ఇక ఇప్పటివరకూ చేసిన పాత్రల కంటే ఈ సినిమాలో సంతోష్ శోభన్ తన నటనతో మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. అన్ని రకాల ఎమోషన్స్ ను ఎంతో బాగా పలికించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది ప్రియా భవానీ శంకర్. శృతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రియా భవాని శంకర్ తన గ్లామర్ తో, నటనతో ఆకట్టుకుంది. ఎమోషన్ సీన్స్ లో బాగా నటించింది. ముఖ్యంగా సంతోష్ శోభన్, ప్రియా భవానీ కెమిస్ట్రీ యూత్ ను ఆకట్టుకుంటుంది. ఇక సద్దాం, సప్తగిరి అక్కడక్కడా కొన్ని నవ్వులు పూయించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రను బాగానే చేశారు.

టెక్నికల్ వాల్యూస్

సాంకేతిక విభాగానికి వస్తే శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం చాలా ప్లజంట్ గా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా చాలా సెట్ అయింది. కార్తీక్ ఘట్టమనేని మంచి విజువల్స్ అందించారు. UV కాన్సెప్ట్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో తెరకెక్కిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఈసినిమాను అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − ten =