ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా తమ జోరును సాగిస్తున్నాయి. ఒకప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లేకపోవడం వల్ల సినీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందని చెప్పొచ్చు. థియేటర్లకు మునుపటి కంటే ప్రేక్షకులు తగ్గారని కూడా చెప్పొచ్చు.. సినిమా అంటే పిచ్చి ఉన్నవాళ్లు, థియేటర్లలో నే సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అనుకునేవాళ్లు ఖచ్చితంగా థియేటర్లకు వెళుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఓటీటీల్లోనే చూసేస్తున్నారు. అందుకే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటూ సందడి చేస్తున్నాయి. అంతేకాదు థియేట్రికల్ రిలీజ్ తర్వాత వీలైనంత తొందరగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో సినిమాలను స్ట్రీమింగ్ చేసేందుకు భారీ ఆఫర్లను సైతం నిర్మాతలకు ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో నెట్ ఫ్లిక్స్ అంతర్జాతీయంగా దూసుకుపోతుంది. మరోవైపు తెలుగు సినిమాలకు కూడా మంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు సినిమా హక్కులను కూడా సొంతం చేసుకోవడానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయి. దీనిలో భాగంగానే ఒక్క నెట్ ఫ్లిక్సే ముందు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 తెలుగు సినిమాలను లైన్ లో పెట్టింది. చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకూ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దమయ్యారు. చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్, అనుష్క కొత్త సినిమా, టిల్లు స్క్వేర్, దసరా, 18 పేజెస్, వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా, కల్యాణ్ రామ్ అమిగోస్, సాయితేజ్ విరూపాక్ష, మహేష్ 28వ సినిమా, ధమాకా, కార్తికేయ2, బుట్టబొమ్మ ఇంకా పలు సినిమాల హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మరి ఒక్క తెలుగులోనే ఈ రేంజ్ లో మార్కెటింగ్ అంటే మాములు విషయం కాదు.
భోళా శంకర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను జరుపుకుంది. ఇక ఈసినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ కానుంది.
అమిగోస్
కళ్యాణ్ రామ్ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకంది.
18 పేజెస్
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా 18 పేజెస్. విభిన్నమైన లవ్ స్టోరీ గా వచ్చిన ఈసినిమా ఇటీవలే రిలీజ్ అయి మంచి టాక్ ను సైతం సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్స్ట్ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈసినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 27వ తేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది.
VT 12
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం తను మరో సినిమాతో సిద్దమవుతున్నాడు. ఈసినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమా హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
విరూపాక్ష
సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా విరూపాక్ష. థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈసినిమా కూడా ఈప్లాట్ ఫామ్ లోనే స్ట్రీమింగ్ కానుంది.
SSMB 28
మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయనున్నారు.
దసరా
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. నాని కెరీల్ మొదటిసారిగా విభిన్నమైన పాత్రలో వస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న దసరా సినిమా ఓటీటీ హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది
అనుష్క శెట్టి సినిమా
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ఓటీటీ హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు.
మీటర్
కిరణ్ అబ్బవరం మాత్రం వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో మీటర్ సినిమా కూడా ఒకటి. ఇటీవలే ఈసినిమాను ప్రకటించారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ పై నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. ఈసినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
PVT 04
మెగా కాంపౌండ్ నుండి వచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్.శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న ఈసినిమా ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కాబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది.
డీజే టిల్లు స్క్వేర్
విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా హిట్ అవ్వడంతో దీని సీక్వేల్ వస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా తమిళ్, తెలుగు, మలయాళం కన్నడలో రిలీజ్ చేయనున్నారు.
ధమాకా
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా వచ్చిన సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఇటీవలే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈసినిమాను జనవరి 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు.
బుట్టబొమ్మ
అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బుట్టబొమ్మ. నత్వరలో ఆమె తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈసినిమా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇంకా సందీప్ కిషన్ ‘బడ్డీ’, కార్తికేయ 8వ చిత్రం, నాగ శౌర్య పేరు పెట్టని సినిమాను కూడా నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: